చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:08 AM
: రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలోని నెరవాడ, ఆలమూరు, కొనిదేడు గ్రామాలలో ప్రభుత్వ పాలనపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. నెరవాడలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం, ప్రభుత్వ పనితీరు తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు.
పాణ్యం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలోని నెరవాడ, ఆలమూరు, కొనిదేడు గ్రామాలలో ప్రభుత్వ పాలనపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. నెరవాడలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం, ప్రభుత్వ పనితీరు తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తామన్నారు. వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. పాణ్యం మండలంలో ఇప్పటికే రూ. 20 కోట్లతో రహదా రులు, తాగునీరు, మురుగుకాల్వలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నెరవాడ రైల్వే వంతెన సమస్యను పరిశీలించారు. వంతెన కింద రాకపోకలకు అనువైన రహదారిని ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను కోరామన్నారు. తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీటీసీలు రంగరమేష్, భస్కరరెడ్డి, సీఐ కిరణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ నరేంద్రకుమార్ రెడ్డి, కన్వీనర్ జయరామి రెడ్డి, అమరసింహారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మునీశ్వర రెడ్డి, ప్రతాపరెడ్డి, రామగోవిందరెడ్డి, రాంపు ల్లారెడ్డి, గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు.
మినీగురుకుల పాఠశాల అభివృద్ధికి నిధులు
పాణ్యం మండలంలోని బలపనూరు పరిధిలోని మినీ గిరిజన గురుకుల పాఠశాల అభివృద్ధికి ఐటీడీఏ నిధుల రూ. 40 లక్షలు కేటాయిస్తున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హామీ ఇచ్చారు. ఆదివారం ఆమె గురుకుల పాఠశాలను తనిఖీ నిర్వహించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ నిర్వహించి పాఠశాల సౌకర్యాలు, ఆహారాన్ని పరిశీలించారు. ఎంఈవో సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, ఎస్‌ఐ నరేంద్రకుమార్ రెడ్డి, ఎంపీటీసీ భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి పాల్గొన్నారు.