Share News

అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించండి

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:49 AM

కల్లూరు అర్బన 16 వార్డులో టెండరు ప్రక్రియ పూర్తైన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారం భించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించండి
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన 16 వార్డులో టెండరు ప్రక్రియ పూర్తైన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారం భించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మాధవీనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్యే నగరపాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌తో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. గౌరు చరిత మాట్లాడుతూ కల్లూ రు శివారు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వర్షాకా లం నేపథ్యంలో కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, అత్యధిక ఆదాయం అందించే కల్లూరు 16 వార్డుల పై నిర్లక్ష్య వైఖరి సరికాదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీల టెండర్లు పూర్తయిన పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యా దవ్‌, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:49 AM