Share News

మరో’సారీ’

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:17 AM

స్టాండింగ్‌ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 6న నిర్వహించాల్సిన సమావేశం సభ్యులు రాకపోవడంతో వాయిదా వేసిన సంగతి విదితమే. అయితే సోమవారం నిర్వహించిన సమావేశంలో 22 అంశాలు ప్రవేశపెట్టగా కేవలం 4 తీర్మానాలను మాత్రమే సభ్యులు ఆమోదించారు. తమను లెక్కచేయడం లేదని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మరో’సారీ’

స్టాండింగ్‌ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా

22 తీర్మానాలు, ఆమోదించినవి నాలుగే..

ముందుగా అజెండా ఇవ్వలేదని చైర్మన్‌పై సభ్యుల ఆగ్రహం

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): స్టాండింగ్‌ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 6న నిర్వహించాల్సిన సమావేశం సభ్యులు రాకపోవడంతో వాయిదా వేసిన సంగతి విదితమే. అయితే సోమవారం నిర్వహించిన సమావేశంలో 22 అంశాలు ప్రవేశపెట్టగా కేవలం 4 తీర్మానాలను మాత్రమే సభ్యులు ఆమోదించారు. తమను లెక్కచేయడం లేదని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కమిటి చైర్మన్‌ బీవై.రామయ్య చేసిన తప్పిదాలతోనే అవుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆమోదించిన తీర్మానాలు..

సప్రీంకోర్టు ఏ,బీసీ నిబంధన ప్రకారం వీధి కుక్కలకు ఆశ్రమ కేంద్రం(స్టెరిటైజేషన్‌ సెంటర్‌) కల్లూరు మండలం బస్తిపాడు గ్రామం సర్వే నెంబరు.362లో ప్రహరీతో కూడిన శాశ్వత ఆశ్రయం నిర్మించేందుకు రూ.25 లక్షలు కేటాయించారు.

కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలో వీధి పశువులు, జంతువుల కోసం జీఐ షెడ్డు, సరిహద్దు రోణ గోడ, సరిహద్దు రక్షణ సౌకర్యాలతో ఆశ్రమం ఏర్పాటుకు రూ.25 లక్షలు కేటాయించారు.

బ్యానర్లు, ఫెక్సీలు తొలగింపు డెమోలిష్‌ స్వ్కాడ్‌ను కాంట్రాక్టు పాతిపదికన 12 మందికి ఏడాది వేతనాలను రూ.30 లక్షలు కేటాయించారు.

కమిటీలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నా..

స్టాండింగ్‌ కమిటీలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లే సభ్యులుగా ఉన్నారు. అయితే తమకు తెలియకుండానే అజెండాలో అభివృద్ది పనులు ఎలా పొందరుపరుస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల ముందు అజెండా కాపీలను ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహి స్తారని సభ్యులు చైర్మన్‌ను ప్రశ్నించారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే చైర్మన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 09 , 2025 | 01:17 AM