స్థాయీ సంఘం ఎన్నికలు ఏకగీవ్రం
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:40 PM
నగర పాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు ఏకగీవ్రమయ్యాయి. ఏడుగురు వైసీపీ కార్పొరే టర్లు నామినేషన్లు వేశారు.
ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ
ఆగస్టు 1న నియామక పత్రాల అందజేత
కర్నూలు న్యూసిటీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు ఏకగీవ్రమయ్యాయి. ఏడుగురు వైసీపీ కార్పొరే టర్లు నామినేషన్లు వేశారు. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఇద్దరు వైసీపీ అభ్యర్థులు తమ నామి నేషన్లను ఉపసంహరించుకున్నారు. ఐదుస్థానాలకు ఐదుగురే బరిలో ఉండటంతో ఎన్ని కలు ఏకగీవ్రం అయ్యాయి. ఆగస్టు 1వ తేదీన ఏకగ్రీవం అయిన అభ్యర్థులకు నియా మక పత్రాలు అందజేయనున్నారు. 28వ వార్డు కార్పొరేటర్ ఇ.నారాయ ణరెడ్డి, 34వ వార్డు కార్పొరేటర్ వై.వెంకటేశ్వర్లు, 39వ వార్డు కార్పొరేటర్ సీహెచ్.సాంబశివరావు, 43వ కార్పొరేటర్ కురువ మునెమ్మ, 50వ వార్డు కార్పొరేటర్ ఎస్‌టీ.షేక్ అహ్మద్ ఎన్నికయ్యారు. 26వ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతరెడ్డి, 1వ వార్డు కార్పొరేటర్ షాషాలి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.