స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:52 PM
నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.
18 నుంచి 24వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
28 వరకు ఉప సంహరణకు గడువు
ఆగస్టు 1న ఎన్నికలు
నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు కార్యాలయంలో నామినేషన్లను స్వీకరణ ఉంటుంది. అదేరోజు సాయంత్రం స్వీకరించిన వారి పేర్లను నోటీసు బోర్డులో ఏర్పాటు చేస్తారు. 25న పరిశీలన అనంతరం ఎన్నికల్లో ఉండే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయనున్నారు. 28న వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆగస్టు 1న కొత్త కౌన్సిల్ హలులో ఎన్నికలు జరగనున్నాయి. గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ప్రస్తుతం పాలకవర్గం ఏర్పడి నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇది చివరిగా జరిగే ఎన్నికలు కావడం విశేషం. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న ఐదు మంది విక్రమసింహరెడ్డి (40 వార్డు), క్రాంతికుమార్ (12వ వార్డు)జుబేర్ అహ్మద్ (7వ వార్డు) చిట్టెమ్మ మిద్దె(31వ వార్డు) యూనుస్ బాషా(10వ వార్డు) పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. స్థాయి సంఘానికి మేయర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.