8 గేట్లతో శ్రీశైలం రిజర్వాయర్ నీటి విడుదల
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:42 PM
శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పోటెత్తడంతో ఇంజనీర్లు 8 గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల ఎత్తు మేరకు తెరిచి స్పిల్‌వే గుండా 2,22,032 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పోటెత్తడంతో ఇంజనీర్లు 8 గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల ఎత్తు మేరకు తెరిచి స్పిల్‌వే గుండా 2,22,032 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 884 అడుగులు ఉండగా నీటినిల్వ సామర్థ్యం 211 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం జెన్‌కో అధికారులు 65,890 క్యూసెక్కులు విడుదల చేశారు.