శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:18 PM
ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేశుల నుంచి జలాశయం నుంచి 1,56,516 క్యూసెక్కుల వరద శ్రీశైలం చేరుకుంటోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలకు 87,525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది.