Share News

శ్రీశైలం క్షేత్రం.. భక్త జనసంద్రం

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:08 PM

శ్రీశైలం క్షేత్రం భక్త జనసంద్రమైంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మల్లికార్జునభ్రమరాంబిక స్వామి అమ్మవార్ల దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు తరలివచ్చారు.

శ్రీశైలం క్షేత్రం.. భక్త జనసంద్రం
శ్రీశైలంలో భక్తుల రద్దీ

వైభవంగా స్వామిఅమ్మవార్లకు ఊయలసేవ

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల కల్చరల్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం క్షేత్రం భక్త జనసంద్రమైంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మల్లికార్జునభ్రమరాంబిక స్వామి అమ్మవార్ల దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు తరలివచ్చారు. లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అయిన అంకాళమ్మకు ఉదయం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ, కుంకు మార్చనలు చేశారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు అంకాళమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పొదకం, విశేషాభిషేకం అర్చనలు నిర్వహించారు.

స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ...

లోకకల్యాణం కోసం అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. గణపతి పూజ అనంతరం స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడషోపచారపూజ తరువాత ఊయలసేవ నిర్వ హించారు. దేవస్థానం తరుపున నిర్వహిస్తున్న ధర్మపదంలో భాగంగా ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద హైదరాబాద్‌ నటరాజ అకాడమీ వారి నృత్యప్రదర్శన నిర్వహించారు. మూషికవాహన, లింగాష్టకం, శివాష్టకం, మహా దేవశివ, అయుగిరినందిని, తదితర గీతాలకు, అష్టకాలకు సం తోషిణి, గాయత్రీ, ఆరాధ్య, అక్షర, మేఘన తదతరులు నృత్యప్ర దర్శన చేశారు. అనంతరం హరికఽథ, బుర్రకఽథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

Updated Date - Jul 25 , 2025 | 11:08 PM