Share News

భక్తులతో శ్రీశైలం కిటకిట

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:33 AM

శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవురోజు కావడం, గణేశ్‌ నవరాత్రులను పురష్కరించుకుని ఐదోరోజు నిమజ్జనోత్సంలో పాల్గొన్న భక్తులు స్వామికార్యం స్వకార్యంలో భాగంగా దైవదర్శనానికి వచ్చారు.

భక్తులతో శ్రీశైలం కిటకిట
క్యూలైన్‌లో దర్శనానికి వెళ్తున్న భక్తులు

నంద్యాల రూరల్‌/ టౌన్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవురోజు కావడం, గణేశ్‌ నవరాత్రులను పురష్కరించుకుని ఐదోరోజు నిమజ్జనోత్సంలో పాల్గొన్న భక్తులు స్వామికార్యం స్వకార్యంలో భాగంగా దైవదర్శనానికి వచ్చారు. శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో అభిషేకించి, అర్చించి, పూజించి తరించారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. నిత్య కళారాధనలో భాగంగా చేపట్టిన ప్రదర్శనలు ఎంతో అలరించాయి. ఆలయ దక్షిణ మాడవీధిలోని కళారాధన వేదికపై విజయవాడకు చెందిన లాస్య కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో చేసిన వినాయకశబ్ధం, సిద్ధివినాయకకౌత్వం వంటి పలు నృత్య ప్రదర్శనలు ప్రదర్శనలు అలరించాయి.

Updated Date - Sep 01 , 2025 | 12:33 AM