Share News

నిండు కుండలా శ్రీశైలం

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:46 PM

శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వతో నిండుకుండలా మారింది.

నిండు కుండలా శ్రీశైలం

నీటి మట్టం 885 అడుగులు

సామర్థ్యం 210.03 టీఎంసీలు

శ్రీశైలం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వతో నిండుకుండలా మారింది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 32,460 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 4,560 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి శ్రీశైల జలాశయానికి 58,426 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. కుడి, ఎడమ గట్టు గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 27,000, 35,315 క్యూసెక్కులు మొత్తంగా 62,315 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. జలాశయంలో నీటిమట్టం 885 అడుగులు ఉంది. నీటిసామర్థ్యం 215 టీఎంసీలకుగాను 210.03 టీఎంసీలుగా నమోదైంది.

Updated Date - Nov 07 , 2025 | 11:46 PM