Share News

నిండుకుండలా శ్రీశైలం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:19 PM

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది.

నిండుకుండలా శ్రీశైలం
జలాశయం గేట్ల నుంచి విడుద లవుతున్న నీరు

పది గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం నిండు కుండలా దర్శనమిస్తోంది. సోమవారం 10 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,67,440 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి ఎడమగట్టు జల ఉత్పాదన కింద 65,603 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తు న్నారు. జూరాల, సుంకేసుల నుంచి 2,35,163 క్యూసె క్కుల వరద జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885అడుగులు కాగా.. సోమ వారం సాయంత్రం 6 గంటలకు 882.10 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 199.7354 టీఎంసీలుగా నమోదైంది.

Updated Date - Sep 01 , 2025 | 11:19 PM