Share News

కనిష్ఠంగా శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:00 AM

శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం కనిష్ఠ స్థాయి కంటే దిగువకు పడిపోయింది.

కనిష్ఠంగా శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం

సున్నిపెంట, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం కనిష్ఠ స్థాయి కంటే దిగువకు పడిపోయింది. దీనితో ఇరు రాష్ర్టాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడగులు కాగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి నీటిమట్టం 818 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 39.90 టిఎంసీలుగా నమోదు అయింది. కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖ ఆదేశాల మేరకు డ్యాం నీటి మట్టం 834 అడుగులకు తగ్గకుండా చూసుకోవాలి. కేంద్ర జల వనరుల శాఖ అదేశాలు బేఖాతరు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో ప్రతి రోజు విద్యుత్‌ ఉత్పాదన జరుపుతున్నారు. దీనితో రిజర్వాయర్‌లో క్రమేపీ నీటి నిలువలు తగ్గుతున్నాయి. కుడి గట్టు విద్యుత్‌ కేంద్రంలో డ్యాం నీటి మట్టం 797 అడులు వరకు విద్యుత్‌ ఉత్పాదన చేసే అవకాశం ఉంది. కాని రిజర్వాయర్‌లో వండ్రు పేరుకు పోవడంతో కుడి గట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదనకు అనుకూలంగా లేదు. అయితే బుధవారం ఎడమ గట్లు విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన జరిగింది. దీనితో 410 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి కేవలం 245 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేశారు. వేసవి తాపానికి 358 క్యూసెక్కుల నీరు అవిరి అయ్యిందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో బుధవారం 0.177 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరిగినట్లు తెలంగాణ జెన్‌కో అఽధికారులు తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 12:00 AM