శ్రీశైలం డ్యాం నీటిమట్టం 884 అడుగులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:16 PM
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 884 అడుగులుగా ఉంది.
శ్రీశైలం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 884 అడుగులుగా ఉంది. నీటినిల్వ సామర్థ్యం 213 టీఎంసీలుగా నమోదు అయింది. ఎగువ జూరాల స్పిల్‌వే నుంచి 35,825 క్యూసెక్కుల నీరు, విద్యుదుత్పత్తి అనంతరం 44,021, సుంకేసుల నుంచి 2,264, హంద్రీ నుంచి 250 కూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తరువాత 66,068 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం గేట్లను బుధవారం నుంచి మూసివేశారు.