Share News

శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:37 PM

శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆదివారం డ్యాం అధికారులు గేట్లను మూసివేశారు.

శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత
మూసివేసిన గేట్లు

శ్రీశైలం, అక్టోబరు 5 (ఆంఽధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆదివారం డ్యాం అధికారులు గేట్లను మూసివేశారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా నమోదైంది. అదేవిధంగా 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న డ్యాంలో ప్రస్తుతం 210 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాలైన జూరాల స్పిల్‌వే, విద్యుదుత్పత్తి, సుంకేసుల, హంద్రీ నుంచి 1,45,300 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. శ్రీశైలం రెండు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 61,853 క్యూసెక్కుల నీటిని డ్యాం అధికారులు విడుదల చేశారు.

Updated Date - Oct 05 , 2025 | 11:37 PM