శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:51 PM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,73,66,587 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, శ్రీపతి ఆచార్ తెలిపారు.
మంత్రాలయం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,73,66,587 నగదు వచ్చినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేశ్ జోషి, శ్రీపతి ఆచార్ తెలిపారు. ఈనెలలోని 20 రోజుల హుండీ ఆదాయాన్ని సోమవారం మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో లెక్కించినట్లు తెలిపారు. రూ.3,73,66,587 నగదుతో పాటు 910 గ్రాముల వెండి, 87 గ్రాములు బంగారు, వివిధ దేశాల కరెన్సీ వచ్చినట్లు చెప్పారు. ఈ హుండీ లెక్కింపులో అనంత పురాణిక్, జేపీస్వామి, కృష్ణమూర్తి, దేశాయ్ నరసింహమూర్తి, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాదాచార్‌పాల్గొన్నారు.