Share News

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:12 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,06,81,661 నగదు వచ్చినట్లు ఏఏవో మాధవ శెట్టి మఠం మేనేజర్లు ఎస్‌కె శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు
హుండీ లెక్కిస్తున్న భక్తులు

మంత్రాలయం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,06,81,661 నగదు వచ్చినట్లు ఏఏవో మాధవ శెట్టి మఠం మేనేజర్లు ఎస్‌కె శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌ తెలిపారు. మంగళవారం గురు రాజ్యాంగన భవనంలో నవంబరు, డిసెంబరు నెలల్లోని 21 రోజుల హుండీ ఆదాయాన్ని దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య లెక్కించారు. ఈ నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 490 గ్రాముల వెండి, వివిధ దేశాల విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమ చేశారు. ఈ లెక్కింపులో అనంతపురానిక్‌ జేపీ స్వామి, కృష్ణమూర్తి, సుజ్ఞానేంద్ర గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:12 PM