దేశ రక్షణ నిధికి శ్రీమఠం రూ.25 లక్షలు విరాళం
ABN , Publish Date - May 13 , 2025 | 11:55 PM
భారత వీర జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న దేశ రక్షణ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రకటించారు.
పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ప్రకటన
మంత్రా లయం, మే 13 (ఆంధ్రజ్యోతి): భారత వీర జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న దేశ రక్షణ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇండో-పాక్ యుద్ధ వాతావరణంలో జవాన్లు వీర మరణం పొందారని గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడిలో హిందూ మతానికి చెందిన వారిని అడిగి మరీ దుర్మార్గంగా హత్య చేయడం బాధాకరమన్నారు. పహల్గాం దాడిలో మృతి చెందిన కర్ణాటక వాసులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇచ్చినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం దేశ సైన్య త్రిదళాలపతులు వీరోచిత పోరాటం చేసి పాకిస్థాన్‌ను కోలుకోలేనంత దెబ్బతీశారని అన్నారు. దేశ రక్షణ నిధికి రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు పీఠాధిపతి తెలిపారు. సమావేశంలో ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేష్ జోషీ, సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తి, అనంతపురాణిక్, జేపీ స్వామి, ఏఈ బద్రినాథ్, రవికులకర్ణి, వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.