శివనామ స్మరణతో మార్మోగిన శ్రీగిరి
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:18 PM
శివనామ స్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. శుక్రవారం శ్రీగిరి పర్వతంపై ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవం
శ్రీశైలం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): శివనామ స్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగింది. శుక్రవారం శ్రీగిరి పర్వతంపై ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవం నిర్వహించారు. కోటిదీపోత్సవ విశేషంపై మాడుగుల నాగఫణిశర్మ వివరించిన ప్రవచనాలతో భక్తులు తన్మయత్వమై తరించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కైలాసగిరి వేదికపై స్వామి అమ్మవార్లకు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అర్చక, వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి దశవిధ హార తులు నివేదించారు. ప్రముఖ ప్రవచకులు దీవి హయగ్రీవాచార్యుల పర్యవే క్షణలో ఙ్ఞానం, వెలుగు, ఉత్సాహం, శాంతి, ఆనం దానికి ప్రతీకగా ఉండే దీపాలను మహిళలచే వెలి గించి కోటిదీప నివేదన చేశారు. సుమారు 2000 మందికి పైగా కోటి దీపోత్సవంలో పాల్గొని దీపా లు వెలిగిం చారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండ లి సభ్యు లు, ఆలయ అధికారులు, సిబ్బంది, శివ సేవకులు, తెదేపా నాయకులు భక్తులు పాల్గొన్నారు.
భ్రామరికి ఊయల సేవ
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మ వారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు. సాయంత్రం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా గణపతిపూజకు సంకల్పాన్ని పఠించారు. ప్రాకార మండపంలో అమ్మవారికి ప్రీతికరమైన ప్రత్యేక పూలతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి పూజలను వైభవంగా నిర్వహించారు. ఊయలసేవలో లలితా సహస్రనామాలు పఠించారు. భక్తులకు దర్శనాలు కల్పించినట్లు ఈవో తెలిపారు.