మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:23 PM
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఎస్‌ఐ సురేష్ అన్నారు.
చాగలమర్రి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఎస్‌ఐ సురేష్ అన్నారు. శుక్రవారం చాగలమర్రి బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి సూపర్-7 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. చిన్నబోదనం గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఠాగూర్ జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన 28 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు షాహిద్, అలెక్స్ తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.5 వేలు నగదు అందజేస్తారన్నారు. అనంతరం ఎస్‌ఐ సురేష్‌ను క్రీడాకారులు సన్మానించారు. కార్యక్రమంలో దాతలు షాహిద్, అలి, జవాన, దస్తగిరి, శివ, క్రీడాకారులు పాల్గొన్నారు.