Share News

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:00 AM

కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను ఆశ్రయిస్తే సత్వర న్యాయ సహాయాన్ని పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలియజేశారు.

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది

జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది

జాతీయ లోక్‌ అదాలత్‌లో ఒకేరోజు 12,558 కేసులు పరిష్కారం

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను ఆశ్రయిస్తే సత్వర న్యాయ సహాయాన్ని పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలియజేశారు. నగరంలోని న్యాయ సేవాసదన్‌ భవన్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతులకు రూ.83,96,374 నష్టపరిహారాన్ని ఈ సందర్బంగా అందజేస్తున్నామని, కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులను లోక్‌ అదాలత్‌ల ద్వారా సత్వరంగా పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 లోక్‌ అదాలత్‌ బెంచీలను ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించామని అన్నారు. ఉమ్మడి కర్నూ లు జిల్లాలో మొత్తం 8,122 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్ర మంలో మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కమలాదేవి, 6వ అదనపు జిల్లా న్యాయాధికారి వాసు, సీబీఐ కోర్టు జిల్లా జడ్జి శోభారాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు హరినాథ్‌ చౌదరి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ ఎం.వెంకట హరినాథ్‌, ప్రిన్సి పల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మల్లేశ్వరి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాఽ దికారి సరోజనమ్మ, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కిరణ్‌ కుమార్‌, కోర్టు మాని టరింగ్‌ సీఐ రామానాయుడు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:00 AM