Share News

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:06 AM

లోక్‌ అదాలత్‌లతో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యా యాధికారి తంగమణి, స్పెషల్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏసురత్నం అన్నారు.

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం
చెక్కును అందజేస్తున్న జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా

జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా

నంద్యాల క్రైం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌లతో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యా యాధికారి తంగమణి, స్పెషల్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఏసురత్నం అన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. న్యాయాధికారులు మాట్లాడుతూ లోక్‌అ దాలత్‌ కార్యక్రమంలో నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 1281, మో టార్‌ ప్రమాద కేసులు 45, సివిల్‌ కేసులు 9, క్రిమినల్‌ కేసులు 188 మొత్తం 1523 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. కక్షిదారులకు రూ.3.70 కోట్లు అందజేశామని చెప్పారు. 2023లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్య విద్యార్థి పర్వేష్‌ కుటుంబ సభ్యులకు చోళవరం ఇన్సూరెన్స్‌ కంపెనీ తరపున న్యాయ వాదులు విజయశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రూ.40 లక్షల చెక్కును జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా అందజేశారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ఓక్‌అదాలత్‌కు వెళితే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తు న్నారన్నారు. కుటుంబ కలహాలతో కోర్టులను ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్‌ దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, లోక్‌అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:06 AM