Share News

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:28 PM

జిల్లాలో మే నెలాఖరుకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌ను సమీక్షిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మే నెలాఖరుకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గృహనిర్మాణాల ప్రగతిపై ఆమె సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ప్రగతి రాష్ట్రంలో దిగువస్థానంలో ఉందని, మే నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు గృహ నిర్మాణాల ప్రగతిలో ముందంజలో ఉండగా నంద్యాల జిల్లా దిగువస్థానంలో ఉండటానికి కారణాలేమిటని ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. నంద్యాల రూరల్‌, అర్బన్‌, ఆత్మకూరు అర్బన్‌, ఆళ్లగడ్డ అర్బన్‌, డోన్‌ అర్బన్‌, వెలుగోడు, నందికొట్కూరు, గోస్పాడు, పాములపాడు, కోవెలకుంట్ల తదితర 14మండలాలు 20శాతం కన్నా తక్కువ ప్రగతి సాధించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో హౌసింగ్‌ ఈఈ శ్రీహరిగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:28 PM