Share News

భవన నిర్మాణాలు వేగవంతం చేయండి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:48 PM

మెడికల్‌ కళాశాలలో భవన నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

భవన నిర్మాణాలు వేగవంతం చేయండి
జీజీహెచ్‌లో ఎమర్జెన్సీ వార్డును పరిశీలిస్తున్న అడిషనల్‌ డీఎంఈ డా.వెంకటేశ్వరరావు

అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వెంకటేశ్వరావు

జీజీహెచ్‌ వసతులపై ఆరా

క్రిటికల్‌ కేర్‌ భవనానికి కేటాయించిన స్థలం పరిశీలన

నంద్యాల హాస్పిటల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మెడికల్‌ కళాశాలలో భవన నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. నవంబర్‌ లోపు పూర్తిచేసి భవ నాన్ని అందజేస్తామని కాంట్రాక్టర్‌ తెలిపారు. కళాశాలలో విద్యార్థుల వసతులపై ప్రిన్సిపాల్‌ డా.సురేఖను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు భవనాలు సరిపోతున్నాయని, అవసరమైతే తాత్కాలి కంగా ఉన్న భవనాలను కూడా ఉపయోగించుకుంటామని అడిషనల్‌ డీఎంఈకి తెలిపారు. జీజీహెచ్‌లో సూపరింటెండెంట్‌ డా.మల్లేశ్వరితో సమీక్ష నిర్వ హించారు. జీజీహెచ్‌ వసతులపై ఆరాతీశారు. ప్రస్తుతం 450బెడ్లు ఉన్నా యని, 3వ బ్యాచ్‌ వస్తే 620 కావాలని సూపరింటెం డెంట్‌ అడిషనల్‌ డీఎంఈ దృష్టికి తెచ్చారు. బెడ్లు పెంచితే భవనం సరిపోదని ఇందుకు అడిషనల్‌ డీఎంఈ ఓపీ బిల్డింగ్‌ను, అడ్మిషన్‌ బిల్డింగ్‌లపై అదనపు అంత స్తులు నిర్మించేందుకు అవకాశం ఉందా అని అడిగారు. దీనికి ఏపీఎంఐసీ డీఈ నరసింహారెడ్డి ఓపీడీ భవనం అవకాశం ఉంటుందని, అడ్మిషన్‌ బిల్డింగ్‌ పురాతనమైందని తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో జీ ప్లస్‌5 అంతస్తులు కట్టి బెడ్లను పెంచు కునేందుకు అవకాశం ఉందని అడిషనల్‌ డీఎంఈ సూచించారు. 60బెడ్లతో క్రిటికల్‌ కేర్‌ భవనం నంద్యాల జీజీహెచ్‌కు ప్రభుత్వం మంజూరుచేసింది. దీనికి సంబంధిం చిన ప్లాన్‌లు తయారు చేసి పంపాలని ఏపీఎంఐసీ డీఈకి సూచించారు. జీజీహెచ్‌లోని ఎమర్జెన్సీవార్డును పరిశీలించారు. జీజీహెచ్‌లో శానిటేషన్‌, సెక్యూరిటీ సర్వీస్‌లు ఎలా ఉన్నాయని ఆరాతీశారు. ఏపీఎంఐసీ ఏఈ మురళి, ఆర్‌ఎంవో డా.వెంకటేష్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:48 PM