స్పెషల్ సబ్‌జైలు ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:12 AM
నంద్యాల స్పెషల్ సబ్ జైలును గురువారం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కర్నూలు కార్యదర్శి బి. లీలావెంకటశేషాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఖైదీల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి
నంద్యాల క్రైం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల స్పెషల్ సబ్ జైలును గురువారం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కర్నూలు కార్యదర్శి బి. లీలావెంకటశేషాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటుచేసిన ప్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ క్లినిక్‌లను జిల్లా న్యాయాధికారి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీలకు న్యాయ సహాయం అందించేందుకు అడ్వకే ట్, పారాలీగల్ వలంటీర్ ఈ హెల్ప్‌డెస్క్‌లో సేవలు అందిస్తార న్నారు. ఖైదీలకు తమ హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. న్యాయవాది లేని ఖైదీలకు న్యాయవాదిని నియ మిస్తామని, 70ఏళ్లు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీ లకు ఉచిత న్యాయ సహాయం అందించి త్వరగా బెయిల్ మం జూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖైదీలను కోర్టువాయి దాలకు కచ్చితంగా హాజరుపరచాలని జైల్ అధికా రులను ఆదేశించారు. ఖైదీలకు సమస్యలేవైనా ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించాలని పేర్కొన్నారు. జైల్‌లో అందిస్తున్న ఆహారం, రేషన్, వైద్య సేవలు తదితర సదుపాయాలను జడ్జి పరిశీలించారు. అలాగే లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివా సు, జైలు అధికారులు, లీగల్ ఎయిడ్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు.