శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:08 PM
శ్రీశైలం ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థానం ఉందని ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజనీర్(సీఈ) కబీర్‌బాషా అన్నారు.
అధికారులు, సిబ్బంది అంకితభావంతో పని చేయడమే కారణం
క్రస్ట్‌గేట్స్ రిటర్నింగ్ అండ్ లిఫ్టింగ్ ప్రాసెస్ కీలకం
సీఈ కబీర్‌బాషా
శ్రీశైలం నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థానం ఉందని ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజనీర్(సీఈ) కబీర్‌బాషా అన్నారు. శనివారం డ్యాంసైట్ వద్ద అధికారులు సిబ్బందితో ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు ముఖ్యఅతిథిగా సీఈ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ నుంచి విడుదలైన వరద ప్రవాహాన్ని పసిగడుతూ దిగువ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాజెక్టుల తీరాలలో ఉండే గ్రామాలు, పట్టణాలు, నగరాలకు ముంపు ప్రమాదాలు వాటిల్లకుండా అధికారులు సిబ్బంది సమన్వయంతో చేస్తు న్నారన్నారు. ఇందులో క్రస్ట్‌గేట్ల రిటర్నింగ్ అండ్ లిఫ్టింగ్ ప్రాసెస్ అత్యంత కీలకమైనదని అన్నారు. అధికారులు, సిబ్బంది కుటుంబ, స్నేహపూర్వక వాతావరణం మధ్య విధులు నిర్వహించడంతో విజయాన్ని సాధించడం సాధ్యమైందని ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి అన్నారు. సిబ్బంది, అధికారులను ప్రశంసా పత్రాలు, నూతన వస్త్రాలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ వేణు గోపాల్‌రెడ్డి, డీఈలు తిప్పే స్వామి, గోపాల్‌నాయక్, చిట్టిబాబు, ఏఈలు మల్లికార్జున, సుదర్శన్, రెడ్డి, సామేల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.