Share News

కల్లూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - May 25 , 2025 | 12:01 AM

కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు.

కల్లూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

అర్బన 16 వార్డులపై సమీక్ష

కల్లూరు, మే 24(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశ భవనలో కమి షనర్‌ ఎస్‌.రవీంద్రబాబుతో కలిసి కల్లూరు అర్బన వార్డుల అభి వృద్ధిపై ఎమ్మెల్యే సమీక్షించారు. ముందుగా వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే చర్చించారు. గౌరు చరిత మాట్లాడుతూ కల్లూరు అర్బన వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187 కోట్లు నిధులు మంజూరు చేసిందని, జగన్నాథగట్టుపై 50 ఎంఎల్‌డి నీటిశుద్ధి కేంద్రానికి రూ.115 కోట్లు, పుచ్చలపల్లి సుందరయ్యపార్క్‌లో 12 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.22 కోట్లు, కల్లూరు అర్బన వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లను సీఎం కేటాయించా రన్నారు. తాగునీటి సమస్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశం అనంతరం 20వ వార్డు బద్రినాథ్‌నగర్‌లో రూ.50లక్షలతో డ్రైనేజీ నిర్మా ణానికి ఎమ్మెల్యే గౌరు చరిత, కమిషనర్‌ రవీంద్రబాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఆర్జీవీ కృష్ణ, మేనేజర్‌ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి కల్లూరు అర్బన 16 వార్డుల టీడీపీ నాయకులు, ఇనచార్జిలు పాల్గొన్నారు.

మహానాడును విజయవంతం చేయండి : గౌరు దంపతులు

కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మాధవీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహానాడు నియోజకవర్గ అబ్జర్వర్‌ పొలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డుల ఇనచార్జిలు, కస్టర్‌ ఇనచార్జిలు, కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం గడివేముల మండలాల అధ్యక్షులతో గౌరు దంపతులు సమావేశమయ్యారు. ఈసందర్బంగా కడపలో నిర్వహిం చనున్న మహానాడుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయ కుడు గౌరు జనార్ధనరెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్‌ ఆదేన్న, నాలుగు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:01 AM