మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:09 AM
మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకదృష్టి సారించా యని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నా రు.
ఆధునిక వైద్యం పేదలకు అందించడమే లక్ష్మం
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల హాస్పిటల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకదృష్టి సారించా యని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నా రు. బుధవారం జీజీహెచ్‌లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆమెతో పాటు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్‌ఈడీ టీవీని ఏర్పాటుచేసి ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా మధ్య ప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని లైవ్ ద్వారా తిలకించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఆధునిక వైద్యం పేదలకు అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. గర్భిణులకు ఈ నెల 17నుంచి 22వరకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 17మెడికల్ కళాశాలలు మంజూరు చేసి రూ.8.500కోట్లు మంజూరుచేయగా వైసీపీ హయాంలో రూ.1400కోట్లు ఖర్చుచేశా రన్నారు. మిగిలిన డబ్బు ఎక్కడకు పోయిం దని తెలపాలని ఆమె ప్రశ్నించారు. కార్యక్ర మంలో రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ విద్యాసా గర్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీసీహెచ్‌ఎ్‌స లలిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, మలేరియా అధికారి చంద్రశేఖర్, డా.అంకిరెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ జగదీశ్చంద్రారెడ్డి, డీఐవో సుదర్శన్‌బాబు, డెమో రవీంద్రనాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సురేఖ, ఐసీడీఎస్ పీడీ తదితరులు పాల్గొన్నారు.