పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:40 PM
గ్రామాల్లో పారిశు ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈవో జి.నాసరరెడ్డి సూచించారు.
జడ్పీ సీఈవో నాసర రెడ్డి
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశు ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈవో జి.నాసరరెడ్డి సూచించారు. నగరంలోని జడ్పీ ఆవరణలోని జిల్లా శిక్షణ వనరుల కేంద్రంలో శనివారం ‘శుభ్రత- పరిశ్రభత’ అనే అంశంపై జిల్లా లోని డివిజనల్ పంచాయతీ అధి కారులు, ఎంపీడీవోలు, డీపీఆర్సీ ఆర్పీలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీ సీఈవో మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఆర్సీ జిల్లా కో-ఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీవోటీలు ఎస్.అష్రఫ్ బాషా, పి.జగన్నాథం పాల్గొన్నారు.