రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:20 AM
రెవెన్యూ, సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
ఆత్మకూరు పీజీఆర్‌ఎ్‌సలో దరఖాస్తుల స్వీకరణ
ఆత్మకూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు సూచించారు. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా వినతులకు సంబంధించి బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల రూరల్, రుద్రవరం, బనగానపల్లె, కొత్తపల్లి, జూపాడుబంగ్లా మండలాల్లో ఎక్కువ శాతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇదిలావుంటే డివిజన్ స్థాయిలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పాల్గొన్న పీజీఆర్‌ఎ్‌సకు సుమారు 300 వరకు దరఖాస్తులు వస్తే ఆత్మకూరు డివిజన్ స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎ్‌సకు కనీసం 50 దరఖాస్తులు కూడా రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెచ్చె ర్వు చెంచులు గృహాలు నిర్మించుకునేందుకు అనుమతులు కోరగా అటవీ, ఐడీటీఏ అధికారులతో సమీక్షించి నిర్ణయిస్తామన్నారు. అదేక్రమంలో గూడెంవాసులను మరోచోటికి తరలించమని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. ఎరువుల పంపిణీలో అవకతవకలకు చోటు లేకుం డా చేపట్టాలని తెలిపారు. ఇరుకైన గదుల్లో పీజీఆర్‌ఎస్ చేపట్టడం వల్ల అక్కడికి వచ్చిన జనం తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సమావేశంలో ఆర్డీవో నాగజ్యోతి, ఇన్‌చార్జి ఏడీఏ హేమలత, తహసీల్దార్ రత్నరాధిక ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నంద్యాలలో పీజీఆర్‌ఎ్‌సకు 289 అర్జీలు
నంద్యాల ఎడ్యుకేషన్: కలెక్టరేట్‌లోని పీజేఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన 289 అర్జీలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌వో రామునాయక్‌లు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి గడువులోగా పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.