Share News

నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:57 AM

ప్రత్యేక కార్యాచరణలో నగరాభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు.

నగరాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
ప్రజలకు కరపత్రాన్ని అందిస్తున్న మంత్రి టీజీ భరత

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

నంద్యాల గేట్‌లో ‘తొలి అడుగు’

కర్నూలు అర్బన, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక కార్యాచరణలో నగరాభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత పేర్కొన్నారు. గురువారం నగరంలోని 13వ డివిజనలోని నంద్యాల గేట్‌లో ‘తొలి అడుగు’లో ఇంటింటి ప్రచారం చేశారు. సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా కార్పొరేషన నిధులు స్థానికంగానే అభివృద్ధి వాడాలని సీఎం చంద్రబాబు ఆదేశిం చారన్నారు. ఏడాదీ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు విజయలక్ష్మి, డివిజన ఇనచార్జిలు, క్లస్టర్‌ ఇనచార్జిలు, బూత ఇనచార్జిలు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:58 AM