సాయిబాబా సన్నిధిలో ఎస్పీ
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:39 AM
పట్టణ సమీపంలోని షిరిడీ సాయిబాబా మందిరాన్ని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా గురువారం దర్శించుకున్నారు.
ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు
ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ
డోన రూరల్, జూన 5 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని షిరిడీ సాయిబాబా మందిరాన్ని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా గురువారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, సాయిబాబా ఆలయ కమిటి సభ్యుల ఆలయ మర్యాదలతో ఎస్పీకి ఘనస్వాగతం పలికారు. అనం తరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేయించి దర్శనం కల్పించారు. కార్యక్రమంలో డోన డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా, టీడీపీ యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్‌రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, కందుకూరు పార్థసారధి, న్యాయవాది ఆలా మల్లికార్జునరెడ్డి, కొండాసురేష్ తదితరులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని షిరిడీ సాయిబాబా మందిరం ఆవరణంలో ధర్మవరం సుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని ఆకాంక్షించారు.