గ్రామాల్లో ఆదాయ వనరులు సృష్టించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:54 PM
గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి, ఇతర పన్నులతో సొంతంగా పంచాయతీలకు ఆదా యాలను సృష్టించు కోవాలని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.
జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి
కర్నూలు, న్యూసిటీ, సెప్టెం బరు 16 (ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి, ఇతర పన్నులతో సొంతంగా పంచాయతీలకు ఆదా యాలను సృష్టించు కోవాలని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. విజయవాడ ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలకు మంగళవారం డీపీఆర్‌సీ భవనంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులైన పన్నులు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుని గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి చట్టాల గురించి తెలుసు కోవాల న్నారు. పంచాయతీల అభివృద్ధికి ఆదాయ వనరులు దోహ దపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో జి.భాస్కర్, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీవోటులు ఏ.జేమ్స్ కృపవరం, పి.ప్రభాకర్, అన్వర్‌బాషా, పి.జగన్నాథం, డీకే దస్తగిరి పాల్గొన్నారు.