అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:21 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కర వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని నగర పాలిక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కర వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని నగర పాలిక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలని ఆదేశించారు. అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటి కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎంఈ మనోహర్‌రెడ్డి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా.వై.నాగప్రసాద్‌బాబు, ఆర్‌ఓ జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
వీకర్ సెక్షన్ కాలనీ బిల్డింగ్స్‌లో రోడ్లు, స్మశాన వాటికకు స్థలం ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు అలివేలు,నగేష్ కమిషనర్ పి.విశ్వనాథ్‌కు వినతి పత్రం అందజేశారు. రహిమాన్ జమ్మన్న, సత్యం, ఐద్వా నాయకురాలు ఎస్.శ్యామల ఉన్నారు.
పాతనగరం పార్కుల్లో నాసిరకంగా నిర్మాణాలు చేస్తుండటంతో ప్రజాధనం వృథా అవుతుందని పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి అన్నారు. పార్కులను అభివృద్ది చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎండీ.యూనుస్, ఎస్.వెంకటేశ్వర్లు, ఈ.లక్ష్మణ గౌడు, సి.మురళి తదితరులు పాల్గొన్నారు