గడువులోగా పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:06 AM
ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం నగర పాలక సమావేశ భవనంలో వినతులు స్వీకరించారు.
కర్నూలు న్యూసిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. సోమవారం నగర పాలక సమావేశ భవనంలో వినతులు స్వీకరించారు. రీ ఓపెన్ కేసులు ఉండకూడదని, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారమేల్యాలా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీసీపీ వెంకటరమణ, ఆర్‌ఓ జునైద్, ప్రజారోగ్య అధికారి నాగశివప్రసాద్, శానిటరీ సూపర్‌వైజర్ నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని 20 కాలనీల ప్రజలకు ఉపయోగపడే ప్రధాన రోడ్డును నిర్మించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యుడు ఇ.పుల్లారెడ్డి కమిషనర్‌ను వినతి పత్రం అందజేశారు. విష్ణుటౌన్‌షిప్ నుంచి వెంకటరమణ కాలనీ, రైల్వేస్టేషన్ మీదుగా నగరంలోకి రావడానికి దగ్గర అవుతుందని 60 అడుగుల రోడ్డును నిర్మించా లని కోరారు. కాలనీవాసులు చంద్రశేఖర్, యూసుఫ్, నాగరాజు, సీవి.వర్మ, ఈ.లక్ష్మణగౌడ్ ఉన్నారు.
27, 30 వార్డులలో సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నగర కార్యదర్శివర్గసభ్యులు సుధాకరప్ప వినతి పత్రం అందజేశారు. 27వ వార్డు క్రిష్ణానగర్ మెయిన్ రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి నేషనల్ హైవే ప్లైఓవర్ బ్రిడ్జి వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, 30వ వార్డు షరీన్ నగర్ అంబేద్కర్ పూలే విగ్రహం నుంచి హంద్రీ నది వరకు పెద్ద కాలువల నిర్మిస్తున్నారని...అయితే కరెంటు పోల్స్‌ను తొలగించడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.ఏసు, ఎం.లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
పూల రైతులకు న్యాయం చేయాలి
కర్నూలు కల్చరల్: పూలు పండించే రైతులకు న్యాయం చేయాలని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్‌కు వినతి పత్రం సమర్పించారు. నాయకులు తూముకుంట ప్రతాపరెడ్డి, గోవిందరాజులు, రాంబాబు, బజరంగ్ దళ్ నాయకులు సాయినాథ్, హరికృష్ణ, అర్జున్, గుజరాతి సురేష్ కమిషనర్‌తో మాట్లాడుతూ పూలమార్కెట్‌లో దళారీల ఆధిపత్యంతో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. స్పందించిన కమిషనర్ చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.