అర్జీలను పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:59 AM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కా రంపై అధికారులతో సమీక్షించారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కా రంపై అధికారులతో సమీక్షించారు. పబ్లిక్ హెల్త్‌లో రీ ఓపెన్ శాతం 50 శాతం ఉందన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 5, కర్నూలు ఆర్డీవో వద్ద 9, పత్తికొండ ఆర్డీవో వద్ద 7, సర్వే ఏడీ వద్ద 3, కలెక్టరేట్ ఏవో వద్ద 2, డిస్ర్టిక్ట్ రిజిస్ర్టార్ వద్ద 2, సివిల్ సప్లయిస్ వద్ద 2, పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ పీడీ, ఏపీఐఐసీ జెడ్‌ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్ ఉన్నాయని, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో వెళ్లకుండా పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ నూరుల్ కమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య ఉన్నారు.
పార్క్ భూముల కబ్జాకు యత్నం...!
నగరంలోని నిర్మల్‌నగర్, గురు రాఘవేంద్ర నగర్, గీతానగర్ పరిధిలో పార్కు భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని రాయలసీమ ఉద్యమ యువనాయకులు సీమకృష్ణ, రాథోడ్, రవికుమార్, మాదాసి కురువ సుంకన్న కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. కల్లూరు గ్రామ పంచాయతీ పరిఽధిలో ఎల్‌పీ-121/1981 పేరుతో ఆమోదించిన లేఅవుట్‌లో మొత్తం 19.66 ఎకరాలు ఉండగా.. అందులో 1.01 ఎకరాలను పార్కు/ ఓపెన్ స్పేస్ కోసం కేటాయించారు. 301/బి, 302, 302/2, 304/1, 305/2, 284/5, 286/1, 287/1 సర్వే నెంబర్లలో ఈ లేఅవుట్ ఉందన్నారు. కబ్జాదా రులు బోగస్ డాక్యుమెంట్లు రూపొందించి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విచారణ చేపట్టాలని కోరారు.