సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:19 AM
అర్జీల రూపంలో వచ్చిన ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు.
సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అర్జీల రూపంలో వచ్చిన ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో డివిజన్‌లోని మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచాలని సూచించారు. మండలంలోని శాఖల అధికారులకు సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరిం చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో వసుంధర, సర్వేయర్ వేణుసూర్య, శ్రీనివాసరాజు, డీఎల్‌పీవో తిమ్మక్క, ఆర్‌అండ్‌బీ ఈఈ పద్మనాభరెడ్డి, హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డి, రమాదేవి, డీటీ బాబు, రుద్రగౌడ్ పాల్గొన్నారు.