Share News

సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:05 AM

ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని సబ్‌కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. మండలంలోని చిన్నగొనేహాల్‌ గ్రామంలో శనివారం ‘పల్లెకు పోదాం’లో సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం
సమస్యలను తెలుసుకుంటున్న సబ్‌కలెక్టర్‌

చిన్నగోనేహాల్‌లో ‘పల్లెకు పోదాం’లో సబ్‌కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని సబ్‌కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. మండలంలోని చిన్నగొనేహాల్‌ గ్రామంలో శనివారం ‘పల్లెకు పోదాం’లో సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ పాల్గొన్నారు. గ్రామంలోని పాఠశాల, ఓహెచ్‌ఎస్‌ఆర్‌, కాలనీలు, శ్మశాన వాటిక, రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఇళ్ల నిర్మాణాలు అంశాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

నిబంధనల మేరకు పనిచేయాలి : ఆర్డీవో

పత్తికొండ: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేయాలని ప్రత్యేకాధికారి, ఆర్డీవో భరత్‌నాయక్‌ సూచించారు. శనివారం ’పల్లెకుపోదాం‘లో భాగంగా పత్తికొండ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, వసతి గృహాలను తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనం మెనూ, తాగునీటిని పరిశీలించారు. బస్సుల కండీషన్‌ రికార్డుల వివారలను తెలుసుకున్నారు. డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు, పీఆర్‌ఏఈ వెంకటేష్‌, సిబ్బంది ఉన్నారు.

పనిచేస్తేనే సమస్యల పరిష్కారం

తుగ్గలి: అధికారులు పనిచేస్తేనే సమస్యలు పరిష్కార మవుతాయని ప్రత్యేకాధికారి సుధాకర్‌ రెడ్డి సూచిం చారు. శనివారం జొన్నగిరిలో సమస్యలను తెలుసుకున్నారు. మురుగును రోడ్డుపైకి వదలవద్దని గ్రామస్థులకు సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, సచివాలయాలను, హాస్టళ్లను తనిఖీ చేశారు. తహసీల్దార్‌ రవి, ఎంపీడీవో విశ్వమోహన్‌, డిప్యూటీ ఎంపీడీవో శ్రీహరి, ఎంఈవో రమావెంకటేశ్‌గౌడు, ఏవో సురేష్‌ సర్పంచ్‌ ఓబులేసు, కార్యదర్శి నారాయణ స్వామి, ఎంపీటీసీ ఎర్రనాగప్ప ఉన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

మద్దికెర: ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎల్‌పీవో రామచంద్రారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని మద్దికెర, బొజ్జనాయునిపేట గ్రామాల్లో ‘పల్లెకు పోదాం’ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - Sep 07 , 2025 | 12:05 AM