సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:55 PM
పంచాయతీ కార్యదర్శుల సమ స్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల జిల్లా సంఘం నాయ కులు డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శుల నిరసన
నంద్యాల నూనెపల్లె, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ కార్యదర్శుల సమ స్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల జిల్లా సంఘం నాయ కులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న పంచా యతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు పనిభారం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజకుమారి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడారు. నంద్యాల డీఎల్‌పీవో రాంబాబును ఘట నాస్థలానికి పంపించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఆయన విన్నారు. డీఎల్‌పీవోకు వినతి పత్రం అందజేశారు.