సమస్యలను త్వరగా పరిష్కరించండి
ABN , Publish Date - May 27 , 2025 | 12:24 AM
ప్రజా సమస్కలను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. సోమవారం కార్యలయంలో పబ్లిక్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్కలను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. సోమవారం కార్యలయంలో పబ్లిక్ గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని మండలం లోని సంబంధిత శాఖల అధికారులకు పంపుతూ గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యల్లో కొన్ని...
తన భర్త మూకప్ప, 2023లో మరణించారని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని హొళగుందకు చెందిన మారెమ్మ అర్జీ ఇచ్చారు.
తమ కాలనీ సమీపంలోని నీటి కుంటల్లో చేపల పెంపకానికి అనుమతి ఇవ్వాలని ఆదోని మండలం విజయనగర్ కాలనీకి చెందిన మత్సకారులు ప్రకాష్, శేఖర్, హుసేని, వీరేష్ అర్జీ సమర్పించుకున్నారు.
తమ గ్రామంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని, సరి చేయించాలని ఆదోని మండలం 104-బసాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప అర్జీ సమర్పించుకున్నారు.
తనకు కల్లుబావి గ్రామ సర్వే నెం. 185లో 0.51 సెంట్ల భూమి ఉందని, ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని ఆదోనికి చెందిన ఈరన్న అర్జీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏవో వసుంధర, సర్వేయర్ వేణుసూర్య, డీఎల్‌డీవో రమణరెడ్డి, జలవనరుల డీఈ షఫీవుల్లా, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియ, ఆర్టీసీ డీఎం మహమ్మద్ రఫి, డిప్యూటీ డీఎం్క్షహెచ్‌వో సత్యవతి, ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేశ్వర్లు, డీటీ వలిబాషా, గుండాల నాయక్ పాల్గొన్నారు