ప్రజా సమస్యలను పరిష్కరించండి : సబ్ కలెక్టర్
ABN , Publish Date - May 06 , 2025 | 12:21 AM
ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను అదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరిచాలని సూచించారు.
ఆదోని, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను అదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరిచాలని సూచించారు. సోమవారం కార్యాలయంలో మండలాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మండలంలోని సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
1. ఆదోని పట్టణం శివశంకర్ నగర్ కాలనీలో వీధిలైట్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని స్థానికులు సరోజ, భారతి, హసీనా భాను, అర్జీ సమర్పించారు.
2. ఆదోని పట్టణానికి చెందిన మధుసూదన్ తనకు మండగిరి గ్రామ పంచాయతీ సర్వే నెం.32లో 2.37 ఎకరాల భూమి ఉండగా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, అలాగే సర్వే నెం.30లో 2.48 ఎకరాల భూమి ఉండగా ఆన్‌లైన్‌లో 2.40 ఎకరాలే చూపిస్తోందని, పరిష్కరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయానలి అర్జీ ఇచ్చారు.
3. గోనెగండ్ల మండల కేంద్రానికి జి.రాజు తనకు సర్వేనెం. 440/2ఏలో 6.50ఎకరాలు, అలాగే సర్వే నెం.440/2బిలో 4.20ఎకరాల భూమి ఉందని, సర్వే చేసి హద్దులు చూపాలని అర్జీ సమర్పించారు.
4. ఆదోని పట్టణంలోని బాలాజీ ఎస్టేట్, ఆదర్శ ఎస్టేట్‌లో కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ లేక ఇబ్బంది పడుతున్నామని, పరిష్కరించాలని కాలనీవాసులు అర్జీ ఇచ్చారు. సర్వేయర్లు శ్రీనివాస రాజు, వేణుసూర్య, డీఎల్డివో రమణ రెడ్డి, షఫీ ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి, డిప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి, ఉప తహసీల్దారు వలిబాషా పాల్గొన్నారు.