Share News

తాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:50 AM

తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎం.అగ్రహారం గ్రామ ప్రజలు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి
ప్రజలతో మాట్లాడుతున్న తహసీల్దార్‌

మద్దికెర, జూలై 21 (ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎం.అగ్రహారం గ్రామ ప్రజలు డిమాండ్‌ చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారవేదిక సమావేశ భవనంలోకి దూసుకెళ్ళారు. ఎంపీడీవో కొండయ్యతో వాగ్వావాదానికి దిగారు. తహసీల్దార్‌ గుండాల్‌ నాయక్‌ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.

Updated Date - Jul 22 , 2025 | 12:50 AM