ప్రజా సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:04 AM
: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ బి.నవ్య
కర్నూలు కలెక్టరేట్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ బి. నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఆమె అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని బీయాండ్‌ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 7, కర్నూలు ఆర్డీవో వద్ద 4, పత్తికొండ ఆర్డీవో వద్ద 3, కలెక్టరేట్ ఏవో 3, సర్వే ఏడీ, విద్యాశాఖ, పశుసంవర్థక శాఖ డీఆర్‌డీఏ పీడీల వద్ద ఒక్కో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.