గెలుపు సైనికులు.. టీడీపీ కార్యకర్తలు
ABN , Publish Date - May 21 , 2025 | 12:03 AM
కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలు గెలుపు సైనికులుగా మారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, తమ విజయం వారి కృషి ఫలితమేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ 20 వార్డులోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో పాణ్యం నియోజకవర్గ మహానాడు నిర్వహించారు.
సమష్టి కృషితో విజయం సాధించాం
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కర్నూలు, మే 20 (ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలు గెలుపు సైనికులుగా మారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, తమ విజయం వారి కృషి ఫలితమేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు అర్బన్ 20 వార్డులోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో పాణ్యం నియోజకవర్గ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీడీపీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. టముందుగా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తల సేవలు ఎన్నటికి మరవలేనన్నారు. తన గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా కష్టపడ్డారన్నారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా గౌరు దంపతలు వారి ఇంటి ముందు వాలిపోతారని, సంతోషంలోనే కాదు.. కష్టాలోనూ అం డగా ఉంటామని, మన అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ మనకు నేర్పించిన విజ్ఞత అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అందుకు కార్యకర్తలు మాకు కొండంత బలాన్ని ఇవ్వాలని కోరారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా కార్యకర్తలను మరవబోమని, మీరే మాకు బలం అని పేర్కొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరైన విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో విజయం ఢంకా మోగించామని, అదే తరహాలో కూడా విజయం సాధించాలని కోరారు. వైసీపీ హయాంలో ప్రాణాలకు తెగించి నిలబడి, కష్టపడిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గౌరు దంపతులను కోరారు. టీడీపీ యువనేత గౌరు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ఆ పార్టీ అరాచకాలపై దైర్యం పోరాడినోళ్లు కార్యకర్తలే అన్నారు. భూ కబ్జాలు కేసినా, అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కార్యకర్తలు భయపడకుండా అడ్రస్ లేకుండా చేశారన్నారు. అనంతరం పలు అభివృద్ధిపై తీర్మానాలుచేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం పరిశీలకులు గాజుల ఆదెన్న, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుశోత్తంరెడ్డి, కల్లూరు కన్వీనర్ రామాంజనేయులు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మాజీ ఎంపీపీ మాధవి, పాలకొలను సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం
కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం మాజీ సర్పంచ్, రైతు నాగ య్య మిరప పంటకు వైసీపీ మూకలు నిప్పుపెట్టి కాల్చేశారు. రూ.30లక్షలకు పైగా రైతు నష్టపోయాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నష్టపరిహారంగా సీఎం చంద్రబాబు రూ.10లక్షలు మంజూరు చేశారు. ఆర్థిక సాయం చెక్‌ను రైతు నాగయ్యకు ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు అందజేశారు.