ప్రభుత్వ లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:28 AM
జమ్మూ కశ్మీర్‌లో హవాల్ధార్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్ బరికేల తిక్కస్వామి (34) అంత్యక్రియలు స్వగ్రామ మైన పగిడ్యాలలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిం చారు. అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడంతో తిక్కస్వామి భౌతికకాయాన్ని ఆర్మీ మేజర్ రాహుల్ దత్త్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో పగిడ్యాలకు గురువారం ఉదయం తీసుకొచ్చారు
నివాళి అర్పించిన ఎమ్మెల్యే, అధికారులు
పగిడ్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో హవాల్ధార్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్ బరికేల తిక్కస్వామి (34) అంత్యక్రియలు స్వగ్రామ మైన పగిడ్యాలలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిం చారు. అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడంతో తిక్కస్వామి భౌతికకాయాన్ని ఆర్మీ మేజర్ రాహుల్ దత్త్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో పగిడ్యాలకు గురువారం ఉదయం తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో పండగ పూట విషాదచాయలు అలుముకున్నాయి. చుట్టు పక్కల గ్రామాలైన బీరవోలు, ఆంజనేయనగర్, సంకిరేణిపల్లె, లక్ష్మాపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, బంధువులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకొని నివాళి అర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య జవాన్ తిక్కస్వామి భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తిక్కస్వామి కుంటుబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. అలాగే తహసీల్దార్ శివరాముడు, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, నాయకులు నివాళి అర్పించారు. అనంతరం గాలిలోకి కాల్పులు జరిపి సైనిక లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు.