మహిళా విద్యతోనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:49 PM
మహిళా విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వయోజన విద్య జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.
వయోజన విద్య జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి
బనగానపల్లె, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహిళా విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వయోజన విద్య జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని పొదుపు భవనంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పొదుపు మహిళలకు, ఏపీఎం కార్యాల యంలో బుక్ కీపర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం, తద్వారా రాష్ట్రం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దన్నారు. జిల్లాలో 3 లక్షల 18 మంది నిరక్ష్యరాస్యులుగా ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించామన్నారు. గతంలో నిర్వహించిన అక్షరాస్యులకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగరాజు, వయోజన విద్య నోడల్ అధి కారి భాస్కర్‌రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ ఆదినరసింహులు, ఏపీఎం హజరత, మండల ఐక్యసంఘం అఽధ్యక్షురాలు ఫకూర్‌బీ, వయోజన విద్య పొదుపు మహిళా వలంటీర్లు పాల్గొన్నారు.