ముంచిన అరటి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:32 PM
అన్నదాతను అరటి తోటలు అమాంతం ముంచేశాయి. ధరలు ఒక్కసారిగా పడి పోయాయి.
టన్ను రూ.2వేలకు పడిపోయిన ధరలు
గొర్రెలకు మేతగా వదిలేసిన గెలలు
లబోదిబోమంటున్న రైతులు
చాగలమర్రి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అన్నదాతను అరటి తోటలు అమాంతం ముంచేశాయి. ధరలు ఒక్కసారిగా పడి పోయాయి. పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు లు లబోదిబోమంటున్నారు. మండలంలోని చిన్నవంగలి గ్రామం లో రైతులు కొండారెడ్డి, లక్ష్మీరెడ్డి నాలుగెకరాల్లో సాగుచేసిన అరటి తోట లను ధరలు లేక వదిలేశారు. ప్రత్యామ్నాయ పంట సాగు చేసేందుకు అరటి గెలలు కోత కోసి గెట్ల వెంట రోడ్లపై పడేశారు. దీంతో జీవాలకు మేతగా మారాయి. జీవాల పెంపకందారులు ట్రాక్టర్ల ద్వారా అరటి గెలలను తీసుకెళ్లి మేతగా వాడుకుంటున్నారు. ఎకరా పెట్టుబడి రూ.లక్ష దాక ఖర్చు చేశారు. వ్యాపారులు కూడా ముందు కు రావడం లేదు. వచ్చిన టన్ను రూ.2వేలు (కిలో రూ.2)కూడా పలకడం లేదు. రైతులు ఆశలు వదులుకొని ట్రాక్టర్లతో అరటి తోటలను దున్నెస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.