వచ్చే నెలలో స్మార్ట్ రేషన్‌కార్డులు
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:26 AM
వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయనుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు అన్నారు.
ఆదోని, జూలై8(ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయనుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించి, ఇంటింటికి తిరుగు తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పాత కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కార్డులు వస్తాయని, నాయకుల ఫొటోలు ఉండవన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నా మన్నారు. గత పాలకులు రైతులకు విత్తనాలు సకాలంలో ఇవ్వలేదని, నాడు-నేడు పేరుతో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. త్వరలో నియోజకవర్గంలో నూతన పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రామస్వామి, రామచంద్ర, ఉమ్మి సలీం, బుద్ధారెడ్డి, అప్సర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.