స్మార్ట్ రేషన కార్డులు ఎంతో మేలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:34 PM
ప్రజలకు సులభతరం చేసేందుకే ప్రభుత్వం స్మార్ట్ రేషన కార్డులను ప్రవేశపెట్టిందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన దేశాయి మాధవరావు అన్నారు.
టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు దేశాయి మాధవరావు
నందవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సులభతరం చేసేందుకే ప్రభుత్వం స్మార్ట్ రేషన కార్డులను ప్రవేశపెట్టిందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన దేశాయి మాధవరావు అన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అదేశాల మేరకు నందవరంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. దేశాయి మాట్లాడుతూ ప్రజలకు స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో బీమశేఖర్, బెస్తా ఈరన్న, వెంకటేశ్వర్లు, మల్ల, శ్రీనివాసులు,పంపయ్య పాల్గొన్నారు.