Share News

స్మార్ట్‌ మీటర్లను తక్షణమే తొలగించాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:49 PM

రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లను తక్షణమే తొలగించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కేకే భవన్‌లో విద్యుత్‌ భారాలపై ప్రజావేదిక ఆధ్వర్యంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాక్రిష్ణ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

స్మార్ట్‌ మీటర్లను తక్షణమే తొలగించాలి
మాట్లాడుతున్న ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

కర్నూలు న్యూసిటీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లను తక్షణమే తొలగించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కేకే భవన్‌లో విద్యుత్‌ భారాలపై ప్రజావేదిక ఆధ్వర్యంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాక్రిష్ణ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్ర భాకర్‌ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప హాజరై స్మార్ట్‌ మీటర్ల వల్ల పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను వివరించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వం ప్రజలపై వేసి అదనపు విద్యుత్‌ భారాలు రూ.15526 కోట్లు రద్దుచేయాలన్నారు. ఆదానీ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందా లను రద్దుచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా విద్యుత్‌ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయ కులు తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:49 PM