స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:11 AM
స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూఅప్ చార్జీలను తగ్గించాలని పట్టణపౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కల్లూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ట్రూఅప్ చార్జీలను తగ్గించాలని పట్టణపౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం అపార్ట్‌మెంట్స్, కాలనీ అసో సియేషన్ల ప్రతినిధులతో పట్టణపౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు విద్యుతశాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పట్టణపౌర సంక్షేమసంఘం నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుతశాఖ ఏర్పాటు చేసిన మీటర్ల స్థానంలో ఆదానీ స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం టెక్నికల్ డీఈ ఓబులేసుకు వినపతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ అడల్ట్ ఎడ్యుకేషన డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, విశ్రాంత మార్కెటింగ్ పర్సనల్ డైరెక్టర్ వరప్రసాద్, ఫుడ్‌బ్యాంక్ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.